సీఎం అయినా, పీఎం అయినా ఉపేక్షించేది లేదు అని డిప్యూటీ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటవీ అధికారులను ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్‌లో బంధించి దాడి చేశారని సీసీ ఫుటేజ్, వీడియోలు విడుదల చేశారు.

ఇక ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కాగా మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను కొట్టారట శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే డ్రైవర్ పై దాడి చేశారు టీడీపీ ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి. ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని.. రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరించారు.
ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి దాడి ఘటనపై విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పూర్తి నివేదికను అందించి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశం https://t.co/GB5wDT9m9Q pic.twitter.com/rzoFiHFORS
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2025