BRS పార్టీ MLC కల్వకుంట్ల కవిత లేఖ రాసారు. సింగరేణి కార్మికులకు BRS పార్టీ MLC కల్వకుంట్ల కవిత లేఖ రాసారు. పదేళ్ల పాటు TBGKS గౌరవాధ్యక్షురాలిగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు కవిత. కొప్పుల ఈశ్వర్ కి శుభాకాంక్షలు చెబుతూనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఈ ఎన్నిక జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని కవిత ఆరోపణలు చేశారు. పదేళ్ల పాటు అధ్యక్షురాలిగా తాను చేసిన పనులను వివరించారు కవిత. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పని చేశానని గుర్తు చేశారు. కాగా ఇటీవలే TBGKS గౌరవాధ్యక్షులుగా కొప్పుల ఈశ్వర్ ను నియామకం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు TBGKS గౌరవాధ్యక్షులుగా కొప్పుల ఈశ్వర్ ఫైనల్ అయ్యారు.