తిరుమలలో చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. గుండు గీయించుకొని మరీ తిరుమలలో చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. టీటీడీ పరిపాలన భవనం ఎదుట శ్రీవారి మెట్టు చిరు వ్యాపారు సంఘం విన్నుతన నిరసన చేశారు. చిరు వ్యాపారస్తులు దీక్ష చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా దీక్ష శిబిరం వద్ద గుండు గీయించుకొని నిరసన తెలిపారు.

తమ సమస్యలను ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్, ఈఓ దృష్టికి తీసుకు వెళ్ళినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సంస్థ ఇకపై తిరుమల కొండపై కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కీలక ప్రకటన చేశారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామని వివరించారు.
https://twitter.com/Telugufeedsite/status/1958467720196059504