మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని ఏపీ కెబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు… మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇక అటు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే దగ్గుబాటి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై..వివరణ ఇచ్చేందుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రయత్నం చేశారు.
మీ వ్యాఖ్యలు, తీరు ఏమాత్రం సరికాదు’ అంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలసి..వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.