యూరియా కోసం దున్నపోతుతో రైతుల వినూత్న నిరసన

-

యూరియా కోసం దున్నపోతుతో రైతులు వినూత్న నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసినా రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడంతో.. దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చిన ముఖ్రా(కే) రైతులు నిరసన తెలిపారు. రాత్రనకా, పగలనకా రైతులు ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmers' innovative protest with bullocks for urea
Farmers’ innovative protest with bullocks for urea

కేసీఆర్ పాలనలో యూరియా సమస్య రాలేదని.. అడ్వాన్డ్స్‌గా పంపిణీ చేశారని.. కానీ కాంగ్రెస్ అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రాలు ఇచ్చినా సర్కార్ పట్టించుకోకపోవడంతో.. సరిపడా యూరియా ఇవ్వాలంటూ దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news