వైసీపీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మా చేతులు కట్టేశారు లేదంటే వైసీపీ నాయకులకు వెంటాడి వేటాడి చుక్కలు చూపించేవాడని అంటూ బాంబు పేల్చారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

శ్రీకాంత్ పెరోల్ విషయంలో టీడీపీ అడ్డంగా దొరికింది. అయితే దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వమని మేమే లేఖలు రాశామన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే అధికారులు పలు కారణాలతో పెరోల్ ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. మేము లేఖలు ఇచ్చిన 14 రోజుల తర్వాత శ్రీకాంత్ కు పెరోల్ వచ్చిందని చెప్పారు.
దీనిపై హోం మంత్రి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారని వెల్లడించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. బాధ్యుతలపై కఠిన శిక్షలు తీసుకుంటామని వివరించారు. ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని లేఖలు ఇవ్వడం సర్వ సాధారణం అన్నారు. అందులో భాగంగానే శ్రీకాంత్ తల్లిదండ్రులు నా వద్దకు వచ్చి పెరోల్ కోసం లేఖ ఇచ్చారని స్పష్టం చేశారు.