గర్భవతి అయిన భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కోశాడు భర్త. హైదరాబాద్ నగరం మేడ్చల్-మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య స్వాతిని చంపి, ఆపై రంపంతో ముక్కలు ముక్కలుగా కోసాడు భర్త మహేందర్ రెడ్డి. ఆపై శరీర భాగాలను కవర్లలో వేసి, బయటికి తీసుకెళ్లి పారేసేందుకు ప్లాన్ చేసాడు.

గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా వెలుగులోకి అసలు విషయం వచ్చింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి.. అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో ప్రేమ వివాహం జరిగింది. ఇక నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.