ఏపీలో నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలలో ఏకంగా కొంతమంది నాలుగైదు పోస్టులకు ఎంపికయ్యారు. కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన మెహతాజ్ ఏకంగా ఐదు పోస్టులకు ఎంపిక అయ్యారు. SGT, SA (తెలుగు, సోషల్), TGT (తెలుగు, సోషల్) ఉద్యోగాలను సాధించారు. ఆమె సోదరీ రేష్మ సైతం స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు ఎంపిక అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మోహన్, పశ్చిమగోదావరి జిల్లా వెంకటకృష్ణ, ప్రకాశం కనిగిరికి చెందిన హర్షిత నాలుగు విభాగాలలో అర్హత సాధించారు.

ఇదిలా ఉండగా… డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు ఈరోజు కాల్ లెటర్లు అందబోతున్నాయి. పోస్టుకు ఒకరి చొప్పున వెరిఫికేషన్ కు పిలవనున్నారు అధికారులు. రేపటి నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండు మూడు రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వెరిఫికేషన్ కు హాజరుకాని వారు సర్టిఫికెట్లను సమర్పించని వారి స్థానంలో ఇతరులను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో డీఎస్సీ పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థులు వెరిఫికేషన్ కు సిద్ధమవుతున్నారు.