ఆరోగ్యకరమైన అల్పాహారం మంచి రోజుకు ప్రారంభం. మనలో చాలామంది అల్పాహారం విషయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఉదయాన్నే త్వరగా ఆఫీసుకు, కాలేజీకి వెళ్లే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ మానేయడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోజంతా నిస్సత్తుగా అనిపించడమే కాక దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అటువంటి సాధారణ తప్పులు గురించి తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే ఆరోగ్యం మెరుగుపవచ్చు.
బ్రేక్ ఫాస్ట్ మానేయడం : ఉదయాన్నే చేసే అతిపెద్ద తప్పు అల్పాహారం తీసుకోకపోవడం రాత్రంతా నిద్రలో ఉన్న తర్వాత శరీరానికి శక్తి అవసరం. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే జీవక్రియ మందగించి రోజంతా అలసటగా అనిపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో బరువు పెరగడానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారి తీస్తుంది. అందుకే ఉదయం కనీసం కొంత అల్పాహారాన్ని తీసుకోవడం ముఖ్యం.
తగినంత ప్రోటీన్ తీసుకోవడం: ఉదయాన్నే కేవలం పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు మాత్రమే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగి వెంటనే పడిపోతాయి. దీని వల్ల త్వరగా ఆకలి వేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు, పాలు, పప్పు దినుసులు, మొలకలు వంటి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన పప్పు దినుసులు, ఉండే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం : ఉదయాన్నే ఎక్కువ చక్కెర ఉన్న జ్యూసులు, స్వీట్, బ్రెడ్ కేకులు వంటివి తినడం మంచిది కాదు. వీటివల్ల శరీరంలో వెంటనే శక్తి పెరిగినట్లు అనిపించినా తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పడిపోయి మరింత నీరసం అనిపిస్తుంది.
పండ్లు మాత్రమే తినడం: పండ్లు ఆరోగ్యకరమైనవి అయిన వాటిని బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే తీసుకోవడం సరికాదు. పండ్ల లో పోషకాలు వున్నా, ప్రోటీన్లు మంచి కొవ్వులు ఉండవు, అందుకే పండ్లతో పాటు నట్స్ ఓట్స్, గుడ్డు కలిపి తీసుకుంటే పూర్తి పోషణ లభిస్తుంది.
అల్పాహారం ఆలస్యంగా తినడం : ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గంట లోపల అల్పాహారం తీసుకోవడం మంచిది. చాలామంది వీకెండ్స్ లో అల్పాహారం పూర్తిగా మానేస్తారు ఉదయం నిద్ర లేవడం ఆలస్యం అవ్వడం వల్ల బ్రేక్ ఫాస్ట్ మానేసి డైరెక్ట్ గా భోజనానికి వెళ్తారు. ఆలస్యంగా తినడం వల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ద్వారా మీరు రోజంతా శక్తివంతంగా ఉండగలరు. ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.