సీతమ్మ అగ్నిప్రవేశం వెనుక గూఢార్థం ఏమిటి?

-

రామాయణంలో సీతమ్మ అగ్ని ప్రవేశం ఓ గొప్ప ధార్మిక ఆధ్యాత్మిక ఘట్టం రావణ చర నుంచి విడుదలైన సీత దేవి పతివ్రతను నిరూపించుకోవడానికి అగ్నిలో ప్రవేశిస్తుంది. ఇది కేవలం శారీరక పరీక్ష కాదు, ధర్మం భక్తి సారాంశం. అగ్ని పవిత్రత సింబల్ గా సీతమ్మ విశ్వాసం, రాముని ఆదర్శ నాయకత్వం ఉట్టిపడతాయి. ఈ ఘట్టం ఆత్మ శుద్ధి, ధర్మానుష్ఠ గూడార్థాలను ఆవిష్కరిస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక పాఠాలను అందిస్తుంది.

యుద్ధకాండలో రావణసంహారం తర్వాత శ్రీరాముడు సీతను తిరిగి పొందుతాడు. ప్రజల సందేహాలను తీర్చడానికి అగ్ని ప్రవేశాన్ని ఆదేశిస్తాడు. ఇది పవిత్ర పరీక్షగా కనిపించిన దీని మర్మం ధర్మానుష్టానం లో ఉంది. అగ్ని శుద్ధికరణ, శక్తి, అహంకారాన్ని భస్మం చేస్తుంది. సీతమ్మ భూమి నుంచి జన్మించిన పవిత్ర స్వరూపిణి తన భక్తితో అగ్ని జయిస్తుంది. ఆమె మనసు రాముని పై స్థిరంగా ఉండడం, ధర్మనిష్టను సూచిస్తుంది.

What Is the Hidden Meaning Behind Sita’s Agnipravesham?
What Is the Hidden Meaning Behind Sita’s Agnipravesham?

శ్రీరాముడు రాజధర్మం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు ఈ ఘట్టం రామాయణంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ఘట్టం ఆత్మ శుద్ధి విశ్వాసం సాక్షాత్కారాన్ని బోధిస్తుంది. సీతమ్మ అగ్నిలో నుంచి బయటకు రావడం ధర్మం యొక్క విజయం. ఇది మాయాభ్రములను తొలగించి ఆధ్యాత్మిక ఆనందానికి మార్గం చూపుతుంది. సీతారాముల దివ్య బంధం భక్తి సమన్వయాన్ని ప్రతిభంస్తుంది.

రావణుడు సీతను అపహరించిన సమయంలో నిజమైన సీత దేవి అగ్నిలో దాచి ఉండగా అతను మాయ సీతను తీసుకువెళ్లాడు. అందువల్ల వచ్చిన అనుమానాలు తప్పించటానికి సీత దేవిపైన  వచ్చే సందేహాలను తీరుస్తూ, రాముడికి నిజమైన సీత ఎవరు అనేది తెలియజేయాలనే ఉద్దేశంతోనే అగ్ని ప్రవేశం జరిగింది. సీతమ్మ పూర్తి విశ్వాసంతో అగ్నిలో ప్రవేశించింది. ఇది రాముడు సీతపై సందేహం కోసం చేయించిన చర్య కాదు, ధర్మాన్ని న్యాయాన్ని ప్రజలు నమ్మకాన్ని పునరుద్దించాలని గొప్ప సందేశం.

సీత అగ్ని ప్రవేశించి ఆజ్వాలలో చెక్కుచెదరకుండా బయటికి రావడం ద్వారా సీత మహా పతివ్రత అని గుర్తింపు పొందింది. ఈ ఘటన రామాయణ ధర్మసంస్థాపనలో ఒక కీలక భాగం. సీతాదేవి తన భర్త పట్ల నిస్వార్థమైన భక్తి, ప్రేమ నిజమైన భార్య ధర్మాన్ని లోకానికి చాటారు. రామాయణం లో రాముడు భగవాన్ విష్ణు అవతారమై లోకానికి ధర్మ మార్గాన నడవడానికి మార్గ నిర్దేశాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news