ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. నేటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. స్మార్ట్ కార్డ్ ల రూపంలో ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం నాలుగు విడతల్లో… రేషన్ కార్డుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో… నేటి నుంచి కార్యక్రమం… మొదలుకానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఉచిత స్మార్ట్ రేషన్ కార్డులను ఇవాల్టి నుంచి నాలుగు విడతలలో పంపిణీ చేసేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. తొలి విడతగా ఇవాల్టి నుంచి విజయనగరం, ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణాజిల్లాలలో… జారీ చేస్తారు అధికారులు. ఆ తర్వాత ఈ నెల 30 అలాగే సెప్టెంబర్ 6, 15వ తేదీలలో మరో మూడు విడతల పంపిణీ జరగనుంది.