దెయ్యం పట్టినట్లు నటించి భర్తను దారుణంగా కొట్టింది ఓ భార్య. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం జంగాల కాలనీకి చెందిన గంగారం అలాగే లక్ష్మి ఇద్దరు దంపతులు. అయితే గంగారం తరచూ మద్యం తాగి వచ్చి ఇంటి దగ్గర రచ్చ చేసేవాడట.

భార్య ఎన్నిసార్లు చెప్పినా కూడా మద్యం… కచ్చితంగా తాగేవాడట. దీంతో… దెయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేసి.. తన భర్తను చితకబారింది భార్య లక్ష్మి. ఈ సంఘటన బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఇక తన భార్యపై గంగారం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://twitter.com/bigtvtelugu/status/1959859415320035409