రాత్రి కొబ్బరి నూనె తాగితే శరీరానికి కలిగే అద్భుత లాభాలు..

-

అమ్మమ్మల కాలం నాటి ఆయుర్వేద చిట్కాలను మనం ఎప్పుడూ నమ్ముతూనే ఉంటాము. కొబ్బరి నూనె కేవలం జుట్టుకు, వంటకు మాత్రమే కాదని మీకు తెలుసా? రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ సులభమైన అలవాటు మీ శరీరం లోపల నుంచి శుభ్రపడి రోగనిరోధక శక్తి పెంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరంగా చూసేద్దాం..

ఆరోగ్యానికి కొబ్బరి నూనె : రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె తాగడం అనేది పురాతన పద్ధతి ఇది శరీరంలోని జీవ క్రియలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ జీవ క్రియను సులభతరం చేస్తాయి. రాత్రిపూట జీర్ణ క్రియ నెమ్మదిగా ఉన్నప్పుడు ఈ నూనె పేగుల కదలికను మెరుగుపరిచి ఉదయం మలబద్ధకం లేకుండా చూస్తుంది. కాబట్టి రోజుకి 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అంతేకాక రాత్రిపూట శరీరానికి శక్తిని అందించి ఉదయాన్నే మరింత చురుగ్గా ఉండడానికి సహాయపడుతుంది.

Amazing Health Benefits of Drinking Coconut Oil at Night
Amazing Health Benefits of Drinking Coconut Oil at Night

మంచి నిద్రకు కొబ్బరి నూనె :ఇందులోని లారీక్ యాసిడ్ ఒక శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియాను వైరస్ ను, నివారించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడును శాంతి పరిచి ఘాడమైన నిద్ర పట్టడానికి సహాయం చేస్తాయి. మరుసటి రోజు ఎంతో ఉత్సాహంగా రిఫ్రెష్ గా నిద్రలేస్తారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం రాత్రి కొబ్బరి నూనె తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని ఓ సాధారణ ఆరోగ్య చిట్కాగా మాత్రమే పరిగణించాలి. ఎందుకంటే దీని వల్ల కొందరిలో జీవక్రియ సమస్యలు  తలెత్తవచ్చు, అందుకే కొబ్బరి నూనె రాత్రిపూట తాగడం ప్రారంభించే ముందు మీ వైద్య నిపుణుడి సాంప్రదించడం మంచిది.

కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అధిక మోతాదు లో తీసుకుంటే క్యాలరీలు పెరిగిపోతాయి. వైద్యుడు సలహా మీద తీసుకోవడం ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news