ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అధికార భాష కమిషన్ పేరు మార్చుతూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు అధికార భాష కమిషన్ పేరును… మండలి వెంకటకృష్ణారావు తెలుగు అధికార భాష కమిషన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గతంలో ఉన్న, అలాగే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పలు పథకాలకు పేర్లు మార్చుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తెలుగు అధికార భాష కమిషన్ పేరు కూడా మార్చింది. త్వరలోనే జిల్లాలను కూడా పెంచే దిశగా అడుగులు వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.