KINGDOM OTT: రేపటి నుంచి ఓటీటీలోకి ‘కింగ్‌డమ్‌’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే

-

KINGDOM OTT: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా జూలై 31వ తేదీన విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను వినాయక చవితి కానుకగా ఈనెల 27వ తేదీ అంటే రేపటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పష్టం చేసింది.

kingdom (1)
Expected OTT Date Of Kingdom Is Here

ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కింగ్డమ్ సినిమా ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చూడాలి. కాగా ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా అనంతరం విజయ్ తన తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం రౌడీ హీరో పాలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news