బీజేపీ పార్టీ దేవుళ్ళ పార్టీ అని పేర్కొన్నారు బండి సంజయ్. సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ సమాజం కోసం పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అని వెల్లడించారు. ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

మహేష్ కుమార్ గౌడ్ చేసిన దొంగ ఓట్ల కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బ్రేకింగ్ న్యూస్ లు వస్తాయనే నన్ను తిడుతున్నారని ఆగ్రహించారు బండి సంజయ్. తెలంగాణలో ఓటు చోరీ లేదు, ఏం లేదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
అదే నిజం అయితే కర్ణాటకలో కూడా మేమే అధికారంలోకి వచ్చేవాళ్లం కదా ? అని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మాకే పూర్తి మెజారిటీ వచ్చేది కదా? అని ఆగ్రహించారు. మహేష్ కుమార్ గౌడ్ గురించి కాంగ్రెస్ నేతలే నాకు ఫోన్ లు చేసి చెప్తున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
బీజేపీ పార్టీ దేవుళ్ళ పార్టీ
సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ సమాజం కోసం పని చేసే పార్టీ బీజేపీ పార్టీ
ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి – బండి సంజయ్ pic.twitter.com/3uAndxC8ik
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2025