ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. చిన్న విషయాలను పెద్ద విషయాలను సైతం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పెట్టడం కామన్ అయిపోయింది. సోషల్ మీడియా కాలంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు ప్రతి ఒక్కటి బయటి ప్రపంచానికి చెబుతున్నారు. పర్సనల్ విషయాలను కూడా దాచుకోవడం లేదు. ఇన్ఫ్లుయెన్సర్ చేసే కొన్ని విషయాలు మంచివి అవుతాయి.

మరికొన్ని వివాదాలకు దారితీస్తాయి. ఈ క్రమంలోని కేరళలోని జాస్మిన్ జాఫర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో చేసిన రీల్ వివాదాస్పదంగా మారింది. జాస్మిన్ ఆలయంలో రీల్ చేయడంతో సాయంత్రం వరకు దర్శనాలను నిలిపివేశారు. గుడిని శుద్ధి చేయాలని దేవస్థాన బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గుడి శుద్ధి పూర్తయిన తర్వాతనే భక్తులను ఆలయంలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. అన్యమత మహిళ గుడిని అపవిత్రం చేసిందని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జాస్మిన్ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ ఆలయ అధికారులు అసలు ఊరుకోవడం లేదు. ఈ విషయం తెలిసిన అనంతరం భక్తులు జాస్మిన్ జాఫర్ పై ఫైర్ అవుతున్నారు.