ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవాలలో తేలు విషం ఒకటి ఒక లీటర్ తేలు విషం కోట్లల్లో అమ్ముడు అవుతుంది ఈ అద్భుతమైన ధర వెనుక ఉన్న కారణాలు ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. దీని ప్రత్యేకమైన లక్షణాలు వైద్య పరిశోధనలో దీని ఉపయోగం దానిని సేకరించడానికి ఉన్న క్లిష్టమైన ప్రక్రియల వల్ల, తేలు విషానికి అంత విలువ ఏర్పడింది. ఈ విషం ఎందుకు అంత విలువైందో దాని ప్రయోజనాలు తెలుసుకుందాం..
తేలు విషం ఎంతో ఖరీదు : డెత్ స్టాకర్ తేలు విషం లీటర్ కురూ.80 కోట్లు పైగా ఖరీదు ఉంటుంది జాతిని బట్టి ఇతర తేళ్లు లీటరు విషం కోట్లల్లో పలుకుతుంది. తేలు విషం కోట్లు పలకడానికి గల కారణం దానిలో ప్రత్యేకమైన రసాయనాల సమ్మేళనం. తేలు విషంలో పెప్టైడ్‌లు,ప్రోటీన్లు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కణాలు ముఖ్యంగా క్యాన్సర్ కణాలు, నరాల కణాలు కండరాల పై ప్రభావం చూపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగానే ఇది వైద్య పరిశోధనలో ఔషధాలు తయారీలో అమూల్యమైంది.
వైద్యరంగంలో తేలు విషం ప్రయోజనాలు : క్యాన్సర్ చికిత్సకు,నరాల సమస్యలకు,ఈ తేలు విషం లోని కొన్ని భాగాలు ముఖ్యంగా క్లోరో టాక్సిన్ అనే పేపర్లు మెదడు కణుతుల గుర్తించి నాశనం చేయడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచించాయి. ఇది ఆరోగ్యకరమైన కణాలను హాని కలిగించకుండా క్యాన్సర్ కణాలను లక్ష్యం చేసుకుని సహాయపడుతుంది. క్యాన్సర్ ట్యూమర్లు, మలేరియా, వంటి అనేక అనారోగ్య సంబంధిత పరిశోధనలలో ఈ విషయం చూపిస్తున్న ఫలితాలు కారణంగా ధర అమాంతం పెరిగిపోయింది.

విషం సేకరించడం కష్టం : తేలు విషం సేకరించడం ఒక కష్టమైనా ప్రమాదకరమైన ప్రక్రియ ఒక తేలు నుండి చాలా తక్కువ పరిమాణంలో విషం లభిస్తుంది. ఒక గ్యాలన్ విషం సేకరించడానికి లక్షలాది తేలు అవసరం అవుతాయి. విషం సేకరించే ప్రక్రియలో తేలుకు ఎలక్ట్రికల్ స్టీమ్యులేషన్ ఇవ్వాలి. ఇది తేలును గాయపరచకుండా తక్కువ మోతాదులో విషం విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం, నైపుణ్యం అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో ఉన్న శ్రమ, ప్రమాదం, తక్కువ దిగుబడి కారణంగా తేలు విషం ధర అసాధారణంగా పెరిగిపోయింది.
తేలు విషం కేవలం ఒక విష పదార్థం కాదు, అది విలువైన వైద్య వనరు. దాని సేకరించడంలో ఉన్న కష్టాలు, వైద్య రంగంలో దాని అద్భుతమైన సామర్ధ్యం కారణంగానే దీనికి ఇంత ధర ఉంది.