తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాగులు అలాగే వంకలు అన్ని పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వర్షాలు.. విపరీతంగా పడుతున్నాయి. నిన్ను అర్ధరాత్రి నుంచే కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో.. భారీ వర్షాల నేపథ్యంలో గణపతుల పూజలకు తీవ్ర ఆటంకం నెలకొంటోంది.

అటు కామారెడ్డి జిల్లాలోని చాలా గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలోనే రేపు కామారెడ్డి జిల్లాలో సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు. రేపు విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డిఇఓ రాజు కూడా కీలక ప్రకటన చేశారు. స్కూలు అలాగే కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షం తగ్గుముఖం పడితే.. సహాయక చర్యలను ముమ్మురం చేయనున్నారు.