తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కేవలం 6 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల పాటు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 77,185 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,098 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.06 కోట్లు సమకూరినట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు. కాగా, మరోవైపు తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికి తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కావున భక్తులు వర్షాలను గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ప్రయాణించాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు వర్షాల సమయంలో తిరగడం వల్ల ఇబ్బంది పడతారని దానికి అనుగుణంగా భక్తులు ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు.