రెండు తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఈరోజు ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఎడతెరపి లేకుండా కుండ పోత వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గంపలగూడెం, తిరువూరు, రెడ్డిగూడెం, విసన్నపేట, ఏ.కొండూరు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాలలో ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు జిల్లా విద్యాశాఖ అధికారి సెలవు ప్రకటించారు. అలాగే ఏలూరు జిల్లాల్లోనూ భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మరో రెండు రోజుల రోజుల పాటు ఇదేవిధంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని APSDMA వెల్లడించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.