గణపతి పూజ కోసం పూజారిని ఎత్తుకెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో జరిగింది.. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గణపతుల ఉత్సవాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు డిజె సౌండ్ లు, గణపతి పూజలతో దేశం మొత్తం మారుమోగుతోంది.

అయితే గణపతుల పూజ నేపథ్యంలో.. పూజారులకు మంచి డిమాండ్ వచ్చింది. పూజారులు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. అయితే తాజాగా వినాయకుడి పూజ కోసం పూజారినే బైక్ పైన కొంతమంది యువకులు ఎత్తుకెళ్లారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం లో ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని… పూజారి కోసం రెండు గ్రూపులు పోటీపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పూజారిని ఓ వర్గం బైక్ పైన ఎత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన యువకులు
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని పూజారి కోసం పోటీ పడ్డ రెండు గ్రూపులు
పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన ఒక వర్గం యువకులు pic.twitter.com/8Hd7yxsm1P
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2025