భారతీయులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాకు సంబంధించిన రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రూపాయి విలువ ఇంత దిగజారడం ఇదే తొలిసారి అంటున్నారు.

భారత వస్తువుల పై అమెరికా విధించిన సుంకాల ప్రభావంతో రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయినట్లు చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. దీంతో రూపాయి మారక విలువ భారీగా క్షీణించి తొలిసారి 87.97 వద్ద జీవన కాల కనిష్ఠాన్ని తాకిందని చెబుతున్నారు.
అమెరికా సుంకాలు ఇలానే కొనసాగితే భారతదేశ జిడిపి వృద్ధిలో 60-80 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఇది ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.