నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపినట్లయితే డబ్బే డబ్బు అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో రికార్డు అయింది. ఆయనను హతమార్చేందుకు కొంతమంది ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒకరు రౌడీ షీటర్, విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు అని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ కృష్ణకాంత్ విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తులు ఎవరో తెలియనుంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వెనుక వైసిపి నేతల హస్తం ఉందేమోనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన వైసిపి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియో వైరల్
మద్యం తాగుతూ వీడియో తీసుకున్న రౌడీషీటర్లు
కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ సంభాషణ
వీడియోలో ఉన్న రౌడీషీటర్లు శ్రీకాంత్, జగదీష్, మహేష్, వినీత్ గా గుర్తింపు pic.twitter.com/Atoj8VhFga
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025