టీఎంసీ ఎంపి మహువా మొయిత్రా కేంద్ర హోం మంత్రిపై సంచలన కామెంట్లు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తల నరికి టేబుల్ పై పెట్టాలని మహువా మొయిత్రా అన్నారు. భారత సరిహద్దులను రక్షించడంలో, చొరబాట్లను ఆరికట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని మహువా మొయిత్రా ఆరోపించారు. చొరబాటుదారులను ప్రోత్సహించే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. మహువా మొయిత్రా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

దీంతో బిజెపి నేతలు మహువాపై ఫైర్ అవుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పట్టుకొని ఇలా మాట్లాడడం సరికాదని పేర్కొంటున్నారు. మహువా మొయిత్రా మాట్లాడిన ఈ మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మహువా మొయిత్రా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు క్షమాపణలు చెప్పాలని బిజెపి నేతలు మండిపడుతున్నారు. బిజెపి నేతలు చేసిన ఈ కామెంట్లపై మహువా మొయిత్రా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.