టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ చాలామంది ప్రముఖులను కోల్పోగా…. తాజాగా అల్లు అరవింద్ తల్లి మరణించారు. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అర్జున్ నానమ్మ తాజాగా మృతి చెందారు. అల్లు కనకరత్నమ్మ 94 సంవత్సరాల వయసులో… మృతి చెందారు.

వృద్ధాప్యం కారణంగా… అల్లు కనక రత్నమ్మ మరణించినట్లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం రెండు గంటల సమయంలో…. ఆమె మరణించినట్లు చెబుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనక రత్నమ్మ అంతక్రియలు జరుగుతాయి. ఈ విషయం తెలియగానే…. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరారు అల్లు అర్జున్. అటు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి మెగా కుటుంబం చేరుకుంది.