తెలంగాణ రాష్ట్రాన్ని వర్షం వీడడం లేదు. దాదాపు నాలుగు రోజులుగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్,సిద్దిపేట లాంటి జిల్లాల్లో మొన్నటి వరకు భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ నగరాలు వరదల నుంచి కోలుకుంటున్నాయి.

అయితే ఇలాంటి నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ అదిలాబాద్ కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల వరంగల్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.