తెలంగాణ, AP ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం చోటు చేసుకున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్ప పీడనం ఎఫెక్ట్ కారణంగా ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

అయితే.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం చోటు చేసుకున్న నేపథ్యంలో…. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయంది. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.