వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తిరుపతిలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో A38, A39 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

నిన్న హైదరాబాద్ లోని మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ఇళ్లల్లో సిట్ సోదాలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. సిట్ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. ఇవాళ తిరుపతిలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. పూర్తి సమాచారం సేకరించి… కోర్టు ముందు నిందితులను హజరు పరిచే ఛాన్సు ఉంది.