ఓయూ విద్యార్థులకు అలర్ట్. ఓయూ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కొత్త పరీక్ష తేదీలపై ప్రకటన చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

అక్టోబర్ 11వ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటన చేసింది సర్కార్. అటు వినాయక నిమజ్జనం సందర్భంగా 6వ తేదీన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. బాలాపూర్ వినాయకుడు చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్, సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు…. ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్‌బండ్ కు వెళతాయి. టోలిచౌకి, మెహిదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ కు చేరుకుంటాయి.