రైతులకు అలర్ట్..అన్నదాత సుఖీభవ కీలక ప్రకటన చేసింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. ఈ-కేవైసీ పూర్తయిన రైతులకు అన్నదాత సుఖీభవ నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. పారదర్శకంగా యూరియా సరఫరా, పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ యూరియా మార్క్ ఫెడ్ ద్వారా పంపిణీ చేశామని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించామనే వార్త పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. ఈ-కేవైసీ పూర్తయిన రైతులకు అన్నదాత సుఖీభవ నగదు జమ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాగా ఇప్పటికే గత నెలలోనే…రైతులకు అన్నదాత సుఖీభవ నగదు జమ చేసింది సర్కార్. ఇప్పుడు మిగిలిన రైతుల ఖాతాలలో డబ్బులు చేయనుంది.