ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనలో చాలామంది విజయం కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం రేయింబవళ్లు కష్టపడక తప్పట్లేదు. అయితే ఈ క్రమంలో మనం మన ఆరోగ్యాన్ని నిలక్ష్యం చేస్తున్నాం. శరీరానికి విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణం. మీ శరీరం మీకు ఇచ్చే హెచ్చరికలు వినకపోతే దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు తప్పవు.
శారీరక ఆరోగ్య సమస్యలు : అధిక పని వల్ల మొదటిగా కనిపించే ప్రభావం దీర్ఘకాలిక అలసట సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి శక్తి అందదు ప్రశాంతంగా రోజంతా నీరసంగా ఉంటారు. ఇది క్రమంగా గుండె జబ్బులు అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఎక్కువ గంటలకు కూర్చుని పనిచేయడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయి. శరీరానికి విశ్రాంతి లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా అనారోగ్యాన్ని గురవుతారు.

మానసిక ఆరోగ్య సమస్యలు: శారీరక సమస్యలతో పాటు అతిగా పనిచేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది చివరకు భరించలేని స్థితికి దారితీస్తుంది. దీని వల్ల పని పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో డిప్రెషన్, మానసిక అలసిట కూడా ఏర్పడతాయి. వ్యక్తిగత జీవితం పై దీని ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి.
అతిగా పనిచేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు కేవలం తాత్కాలికమైనవి కాదు. అవి దీర్ఘకాలంలో మన శరీర మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పని విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం చాలా అవసరం.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే, ఏదైనా ఆరోగ్య సమస్యలకు, మానసిక సమస్యలకు వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమం.