తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి బిగ్… అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే కనీసం ఒక్కరోజు అంటే 24 గంటల సమయం పడుతోంది. వీకెండ్ కావడంతో తిరుమలకు… భక్తులు వేలాది సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉండడం జరిగింది.

టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లో తిరుమల శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే 31,439 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.