మనిషి శరీరంలో ప్రతి వారం ఒక క్రెడిట్ కార్డు సైజులో ప్లాస్టిక్ కణాలు చేరుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. మనం వాడే ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ప్యాకేజీ మెటీరియల్స్ ద్వారా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఈ కణాలు గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్లి రక్తం, ఊపిరితులు, గుండె వంటి ముఖ్యమైన అవయవాల్లో పేరుకు పోతున్నాయి. ఈ ప్లాస్టిక్ కణాలు మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏమిటి : ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ కణాలను మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ప్లాస్టిక్ వస్తువులు, చిన్న చిన్న ముక్కలుగా విడిపోయినప్పుడు ఇవి ఏర్పడతాయి ఈ కణాలు గాలిలో నీటిలో నేలలో కలిసిపోతాయి. చివరికి మన ఆహారంలో భాగమే మన శరీరంలోనికి చేరుతాయి.
మైక్రో ప్లాస్టిక్స్ ఎలా చేరుతాయి : ప్లాస్టిక్ సీసాలు, ఫిల్టర్లలో ప్లాస్టిక్ ద్వారా తాగునీరు మనం తీసుకున్నప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ నీటిలో కలిసి మన శరీరంలోనికి చేరుతాయి. ఇక ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో ఉండే ఆహార పదార్థాలు, సముద్రపు చేపలు తినడం ద్వారా కూడా మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోనికి చేరుతాయి. ఇక గాలిలో ఉండే ప్లాస్టిక్ ఫైబర్ ఊపిరి పీల్చుకోవడం వల్ల మన శరీరంలో ప్రవేశిస్తుంది.

ఆరోగ్యానికి హానికరం : ప్రస్తుతానికి మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అవి క్యాన్సర్ జీవన సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు హార్మోన్ల ఇన్ బాలన్స్ వంటి సమస్యలకు కారణం కావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలో విష పదార్థాలుగా పని చేస్తాయి.
పరిష్కారం: ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా గాజు సీసాలు, స్టీల్ బాటిల్స్ వాడాలి. ముఖ్యంగా ఇప్పుడే ఎదుగుతున్న పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు వారికి ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని ఇచ్చి పంపిస్తాము. అలా కాకుండా వారికి గాజు సీసాలు లేదా స్టీల్ బాటిల్స్ వాడడం ఉత్తమం.
ప్యాకేజింగ్ లేని ఆహార పదార్థాలు కొనడం వీలైనంతవరకు ప్లాస్టిక్ లో నిల్వలేని ఆహార పదార్థాలు ఎంచుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా నీటిని శుద్ధి చేసుకోవడం ఎంతో ఉత్తమం నీటిని తాగే ముందు ఫిల్టర్ చేసుకొని తాగడం కొంతమేర మైక్రో ప్లాస్టిక్స్ ను తొలగించవచ్చు.