మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య!

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది.. ప్రియుడి మోజులో భర్తను చంపించింది భార్య. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త అహోబిలంను కడతేర్చింది భార్య పద్మావతి.

aunty
aunty

ప్రియురాలి కోసం బెంగుళూరు నుంచి వచ్చి హత్య చేశాడు ప్రియుడు చెన్నబసవ. ఈ నెల 3వ తేదీన తొగలగల్లు, దొడగొండ గ్రామాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు వద్ద అహోబిలం మృతదేహం లభ్యమైంది. బైక్‌పై వెళ్తున్న అహోబిలంపై దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో నిందితులు చెన్నబసవ, పద్మావతిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news