టీమిండియా ఫ్యాన్స్ కు షాక్. టీమ్ ఇండియా ODI కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మను సెప్టెంబర్ 8, 2025 రాత్రి అంటే నిన్నటి రోజున ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

టీమ్ ఇండియా ODI కెప్టెన్ రోహిత్ శర్మ…ఆస్పత్రి లోపలికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో చెకప్ చేయించుకునేందుకు ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా.. ఇప్పటికే టీ20లు, అలాగే టెస్ట్ క్రికెట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Rohit Sharma spotted in Kokilaben hospital Mumbai.❤️ pic.twitter.com/bQ6zTuixGc
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 8, 2025