తెలుగు రాష్ట్రాలలో గణేషుడి పండుగను ఎంతో వైభవంగా పూర్తి చేసుకున్నారు. ఇక హైదరాబాద్, ముంబై లాంటి మహానగరాలలో గణేశుడి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాదులో ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో బాలాపూర్ గణేశుడి లడ్డు చాలా ఫేమస్. చాలామంది బాలాపూర్ గణేషుడి లడ్డు సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. లక్షలు పెట్టి అయినా బాలాపూర్ గణేశుడి లడ్డు దక్కించుకోవాలనుకుంటారు.

ఈ సంవత్సరం బాలాపూర్ గణేశుడి లడ్డు ఏకంగా రూ. 35 లక్షలకు అమ్ముడయింది. ఇక గణేశుడిని చూడడానికి వెళ్ళిన వారు హుండీలో భారీ స్థాయిలో డబ్బులను వేశారు. ఈసారి బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం ఏకంగా రూ. 23,13,760 వచ్చినట్లుగా ఉత్సవ కమిటీ చైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం రూ. 18 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం ఏకంగా ఐదు లక్షల ఆదాయం పెరగడంతో బాలాపూర్ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో ప్రజలు గణేశుడికి పూజలు నిర్వహించారు.