ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ కృతిక శుక్ల తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈనెల 10 నుంచి అక్టోబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

]అలాగే రూ. 1,000 పైన్ తో అక్టోబర్ 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే పరీక్షలలో పాస్ అయిన వారు మళ్ళీ పరీక్ష రాసేందుకు రూ. 1,350 (ఆర్ట్స్), రూ. 1,600 (సైన్స్) కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. వీలైనంతవరకు విద్యార్థులు ఫైన్ లేకుండానే ఫీజులు చెల్లించాలని అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ సమయంలోపు చెల్లించలేని వారు ఫైన్ తో కలిపి చెల్లించు కునే అవకాశం ఉందని పేర్కొన్నారు.