కొన్నిసార్లు ఉదయాన్నే ఏం తినాలి అనే ఆలోచన చాలా మందిని సతమతం చేస్తుంది. కొందరు బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తే మరి కొందరు త్వరగా అయ్యేది ఏదో ఒకటి తినేసి వెళ్తారు. కానీ ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం రోజు మొత్తం మన శక్తిని, ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తుంది. రోజంతా చురుగ్గా ఉండాలన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఉదయం తినే తిండి విషయంలో అసలు రాజీ పడకూడదు. మరి మనం రోజు తినే కొన్ని రకాల అల్పాహారాల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి అనేది తెలుసుకుందాం..
బ్రేక్ ఫాస్ట్ రోజులో మొదటిది అతి ముఖ్యమైన భోజనం. రాత్రి నిద్ర తర్వాత శరీరానికి శక్తి అందించే ఇంధనం ఇది. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే రోజు మొత్తం అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మెదడు చురుగ్గా పనిచేయాలన్న, బరువు అదుపులో ఉండాలన్న మనం తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది.
ఎక్కువమంది తీసుకునే అల్పాహారంలో ఇడ్లీ, దోస ముందుగా ఉంటాయి. ఇవి బియ్యం మినప్పప్పుతో తయారయ్యి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లను అందిస్తాయి. పులియపెట్టిన పిండి వల్ల వీటిలో విటమిన్ బి 12 ఉంటుంది. వీటితో పాటు సాంబార్, చట్నీ తీసుకుంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇక అలాగే ఉప్మా బొంబాయి రవ్వతో చేస్తే కార్బోహైడ్రేట్స్, కూరగాయలు జోడిస్తే విటమిన్లు,ఫైబర్ ఉంటుంది. వీటితోపాటు పెసరట్టులో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయి. పెసలలో ఉండే ప్రోటీన్ బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.

ఇక తొందరగా అయిపోయే అల్పాహారాల్లో ఆమ్లెట్ ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇందులో కూడా ఎన్నో రకాల ప్రోటీన్స్, విటమిన్స్ దాగి ఉన్నాయి. గుడ్డుతో చేసే ఆమ్లెట్లో ప్రోటీన్, విటమిన్ D, B12 ఎక్కువగా ఉంటాయి. కండరాల ఆరోగ్యానికి, మెదడు చురుగ్గా ఉండడానికి ఇది సహాయపడుతుంది.
ఇక మొలకెత్తిన గింజల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా స్వీకరిస్తే జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది. ఇక మొలకెత్తిన గింజల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా స్వీకరిస్తే జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది. ఇక రాగి జావ,ఓట్స్ ను టిఫిన్ కింద తీసుకుంటే, ఇందులో క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు శక్తి లభిస్తుంది. పైన పేర్కొన్న ఆహార పదార్థాల్లో మీ అభిరుచికి ఆరోగ్యానికి తగిన వాటిని ఎంచుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
గమనిక:ఏ ఆహారాన్ని ఐన మితంగా తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య నిపుణుని సలహా తీసుకోవడం ఉత్తమం.