ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో… భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన అనంతరం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం… ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగానే అనంతపురం లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు… అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ సభ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఈ భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వారితోపాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూటమి నాయకులు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 15 నెలలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి చంద్రబాబు కూటమి ప్రభుత్వం.