ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా కుప్పం లోనే రైతులు అగచాట్లు పడుతున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా చంద్రబాబు బావి చూసుకుని దూకి చావలని… అలాగే అచ్చెన్నాయుడు కూడా చనిపోవాలని హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్. యూరియా సమస్య విపరీతంగా ఉంటే…. చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఫైర్ అయ్యారు.

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…సంపద సృష్టి అంటే చంద్రబాబు సంపద పెంచుకోవడమే అంటూ ఆగ్రహించారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఆయన మనుషులకు దోచిపెడుతున్నాడని నిప్పులు చెరిగారు. ప్రజల బాగోగుల పట్ల చంద్రబాబుది లెక్కలేనితనం అని ఫైర్ అయ్యారు. కూటమి నేతలు దిగజారిపోయి స్కామ్ లు చేస్తున్నాడని… సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చెప్పి ప్రజల ఆస్తులు అమ్మేస్తున్నారని ఆగ్రహించారు వైఎస్ జగన్.