నీట మునిగిన మెదక్..2 గంటల వ్యవధిలోనే 7 సెం మీ వర్షపాతం

-

మెదక్ జిల్లాలో భారీ వ‌ర్షం కురుస్తోంది. భారీ వర్షానికి మెదక్…మళ్లీ నీట మునిగింది. 2 గంటల వ్యవధిలోనే 7 సెంటిమీటర్ల వర్షపాతం అయింది. దీంతో మెద‌క్ ప‌ట్ట‌ణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెల్‌కమ్ బోర్డు వద్ద మెదక్ – హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా వరద నీరు నిలిచింది.

Medak submerged in water 7 cm rainfall in 2 hours
Medak submerged in water 7 cm rainfall in 2 hours

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మెద‌క్ ప‌ట్ట‌ణంలోని కాల‌నీలు నీట మునిగాయి. అటు ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు ప‌డున్నాయి. పిడుగులు ప‌డే ప్ర‌మాదం కూడా పొంచిఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది APSDMA. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news