తిరుమ‌ల‌లో మ‌రో అప‌చారం…అలిపిరి మెట్ల వ‌ద్దే నాన్ వెజ్

-

తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద అధికారులు భారీకేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ భారీకేడ్లపై నాన్ వెజ్ ఫుడ్ తో ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న కోట్లాదిమంది భక్తులకు భారీకేడ్లతో స్వాగతం పలుకుతున్నట్లుగా దృశ్యంలో కనిపిస్తోంది. దీంతో విజిలెన్స్ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో నాన్ వెజ్ ఫుడ్ తో భారీకేడ్లపై ఇలాంటి దృశ్యాలు ఏంటని ఫైర్ అవుతున్నారు.

తిరుమలలో ఇదివరకే మాంసాహారం సైతం కనిపించి కలకలం చోటు చేసుకుంది. తిరుమల గుట్టపై చాలామంది ఈ మధ్యకాలంలో రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే దీనిపైన అధికారులు ఇదివరకే కేస్ కూడా వేశారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తిరుమల గుట్టపై రీల్స్ చేస్తూ కనిపించారు. అంతేకాకుండా మద్యం బాటిళ్లు సైతం శ్రీవారి గుట్టపై కనిపించాయి. దీంతో విజిలెన్స్ అధికారుల తీరుపై చాలా మంది ఫైర్ అవుతున్నారు. తిరుమల శ్రీవారిలో ఎలాంటి అపవిత్రం జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news