తెలంగాణలో గత కొన్ని నెలల నుంచి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారు ఉచితంగా సన్నబియ్యం పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ రేషన్ షాప్ లలో వచ్చే సన్నబియ్యం తినడం వల్ల మార్కెట్లో సన్న బియ్యం రేట్లు పూర్తిగా తగ్గిపోయాయి. గత మూడు నాలుగు నెలల నుంచి పేద, మధ్య తరగతి వారు బియ్యం కొనుగోలు పూర్తిగా తగ్గించారు.

మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ లేకపోవడంతో రేట్లు కూడా పడిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. క్వింటాల్ కు రూ. 1,000 వరకు బియ్యం రేట్లు తగ్గినట్లు సమాచారం అందుతుంది. గతంలో క్వింటా బియ్యం సంచి రూ. 5-6 వేలు వరకు ఉండగా… ఇప్పుడు క్వింటా బియ్యం సంచి రూ. 4-5 వేలకు దిగింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యం రేట్లు పూర్తిగా తగ్గిపోవడంతో బియ్యం దుకాణదారులు పూర్తిగా నష్టపోతున్నామని బాధపడుతున్నారు.