తెలంగాణలోని మహిళా సంఘాలకు శుభవార్త. 4,079 మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.11 కోట్ల రివాల్వింగ్ విడుదల చేసింది. ఒక్కో సంఘానికి రూ. 15,000 కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షించబోతున్నట్టుగా తెలుస్తోంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు… అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో మూడు సంఘాలకు నిధులు అందనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మహిళా సంఘాలలోని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఇచ్చిన హామీలను పెద్దగా నెరవేర్చలేదని ప్రజలు ఫైర్ అవుతున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే మరికొంతమంది తిట్టిపోస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి తన పాలనను కొనసాగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకు వచ్చినప్పటికీ కొంతమంది ప్రజలు తన పాలనను ఏమాత్రం మెచ్చుకోవడం లేదు.