ఇంట్లో చెప్పులు వేసుకోవడం మంచిదా? చెడ్డదా?

-

ఇంట్లో చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఈ ప్రశ్న ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. కొందరి అభిప్రాయం ప్రకారం ఇంట్లో చెప్పులు వేసుకోవడం పరిశుభ్రత మరియు సౌకర్యం కోసం అవసరమని చెబుతారు. అయితే మరోవైపు, ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదని కొంతమంది వాదిస్తారు. కాబట్టి ఈ విషయం కేవలం సౌకర్యానికే సంబంధించినది కాదు. మన ఆరోగ్యం, పరిశుభ్రత, అలాగే సాంప్రదాయంతో కూడా బలమైన సంబంధం ఉంది. మన జీవనశైలి, నివసించే పరిసరాలు, అలవాట్ల ఆధారంగా ఇంట్లో చెప్పులు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు రెండింటినీ తెలుసుకోవటం ముఖ్యం. మరి ఇంట్లో చెప్పులు వేసుకోవడం వల్ల కలిగే మంచి, చెడు ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం…

ఇంట్లో చెప్పులు వేసుకోవటం వల్ల ప్రయోజనాలు: చెప్పులు వేసుకోవడం వల్ల బయటి దుమ్ము, మట్టి ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. అలాగే, ఇంట్లో కూడా కాలుష్యం లేకుండా ఉంటుంది. పదునైన వస్తువులు (గాజు ముక్కలు, మేకులు వంటివి) లేదా ఇతర అపరిశుభ్రమైన వస్తువులు నేల మీద ఉన్నప్పుడు పాదాలకు రక్షణగా ఉంటాయి. చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలకు ఊతమిచ్చి, కీళ్ల నొప్పులను నివారించవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం.

Is Wearing Shoes Inside the House Good or Bad?
Is Wearing Shoes Inside the House Good or Bad?

ఇంట్లో చెప్పులు వేసుకోకపోవడం వల్ల ప్రయోజనాలు: మైక్రోబయోమ్ మెరుగుదల వుంటుంది. చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల చర్మం నేల మైక్రోబయోమ్‌తో సంపర్కం చెందుతుంది. దీనివల్ల మన రోగనిరోధక శక్తి మెరుగుపడవచ్చు.పాదాలకు విశ్రాంతి లభిస్తుంది ఇంకా చెప్పులు లేకుండా ఉండటం వల్ల పాదాలు స్వేచ్ఛగా, గాలి తగిలేలా ఉంటాయి. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. సహజ స్పర్శ కలుగుతుంది ఇంకా పాదాలు నేలను నేరుగా తాకడం వల్ల భూమితో అనుసంధానం అయినట్లుగా, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఇంట్లో చెప్పులు వేసుకోవడం మంచిదా కాదా అనేది వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, మరియు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే చెప్పులు ఎక్కడ వేసుకున్న ఇంట్లో దేవుని మందిరం దెగ్గర వేసుకోకూడదు. బయటి నుండి వచ్చిన చెప్పులను ఇంట్లో వేసుకోకుండా, ఇంటి లోపల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులను ధరించడం ఉత్తమం. ఇది పరిశుభ్రతను కాపాడటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం మరియు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news