ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు బిగ్ అలర్ట్. వాహన మిత్ర పథకానికి కొన్ని రూల్స్ పెట్టింది ఏపీ సర్కార్. వాహన మిత్ర పథకం కింద 15 వేల రూపాయలు పొందాలంటే ఆటో అలాగే క్యాబ్ యజమాని డ్రైవర్ గా ఉండాలని స్పష్టం చేసింది. గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించబోదని వెల్లడించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్క వాహనానికే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న… ఇన్కమ్ టాక్స్ కడుతున్న… పట్టణంలో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉండకూడదని కూడా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉండాలి. ఇంటి కరెంట్ బిల్లు 300 దాటకూడదు అని వెల్లడించింది సర్కారు.