తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులకు పిక్సిమమ్ సిద్ధమైంది. LED మానుఫ్యాక్చురింగ్ రంగంలో పిక్సియమ్ డిస్ప్లే టెక్నాలజీస్ LEDలు, మైక్రో LEDలు, ఆడియో వీడియో కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమ పెట్టేందుకు రెడీ అయ్యారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశలో రూ.200-250 కోట్లతో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇక ఈ పరిశ్రమ ద్వారా 100కి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 5 వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రెండో దశలో దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధం కూడా చేశారు.
రెండో దశలో 5 వేల మందికి నేరుగా ఉద్యోగావకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ సంస్థకు గుజరాత్, తమిళనాడు ఆహ్వానం పలికినప్పటికీ, ప్రభుత్వ సహకారం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండడంతో తెలంగాణనే తమ పరిశ్రమ ఏర్పాటుకు ఎంచుకున్నామన్నారు పిక్సిమ్ సంస్థ ప్రతినిధులు.