ASIA CUP 2025: పాక్‌తో నేడే భారత్ పోరు ఉంది. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచానికి తీవ్ర ఆసక్తి ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా నేటి పరిస్థితి ఉంది. ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా కనిపించడం లేదు ఉత్కంఠ.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం శత్రు దేశమైన పాకిస్థాన్‌తో క్రికెట్ వద్దని కోరుకుంటున్నారు భారతీయులు. ఈ క్రమంలోనే ‘బాయ్‌కాట్ ఆసియా కప్’, ‘బాయ్‌కాట్ INDvsPAK’ హ్యాష్‌ట్యాగ్‌లు ‘ఎక్స్’లో ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇటీవలే యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… ఇవాళ్టి మ్యాచ్ ను బై కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.