గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలర్ఠ్. రోడ్డు మీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం అని ఆదేశాలు ఇచ్చే దిశగా గ్రేటర్ హైదరాబాద్ అడుగులు వేస్తోంది. సెక్షన్ 70(బీ), 66 సీపీ యాక్ట్ కింద.. రోడ్డుపై చెత్త వేశారన్న అభియోగాలు రుజువైతే జైలుకెళ్లడం ఖాయం అంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. GHMC అధికారుల సమన్వయంతో చెత్త వేసే వారిపై నిఘా వేస్తున్నారు పోలీసులు.

చెత్త వేస్తున్న హాట్ స్పాట్‌లను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు అరెస్టు అయ్యారు. కోర్టులో హాజరుపరచగా రూ.1000 ఫైన్ పడనుంది. చట్టంలో ఉన్న ఇతర చట్టాల ప్రకారం.. 8 రోజుల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటున్నారు పోలీసులు.